వీరభోగ వసంతరాయలు ట్రైలర్ విడుదల
ఒక కొత్త ఆలోచనతో తెరకెక్కిన చిత్రం వీరభోగ వసంతరాయులు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఈ చిత్రం కథే అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారాలుగా ఆర్.ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరభోగ వసంతరాయులు. బెల్లన అప్పారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన సుకుమార్ మాట్లాడుతూ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరడానికి ఓ సారి ఇంద్ర వచ్చినప్పుడు కుదరదని చెప్పాను. ఆ తర్వాత ఓ సందర్భంలో ఈ సినిమాలో ఆలోచన గురించి చెప్పాడు. ఇటీవల ఈ సినిమా చుశా. చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ట్రెండీ గానూ ఉంది. ఐడియా పరంగా ఇంద్రకు నేను పోటీ కాదని ఈ సినిమా చూశాక అర్థం చేసుకున్నాను. సినిమా విడుదల రోజు మళ్లీ చూస్తా అన్నారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. నేను మాట్లాడటం కంటే విడుదలయ్యాక ఈ సినిమానే ఎక్కువగా మాట్లాడుతుందనే నమ్మకం ఉంది అన్నారు నారా రోహిత్. ఇంద్ర చాలా కష్టపడ్డారు. చిరంజీవి ఇంద్ర కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అన్నారు శ్రీ విష్ణు. ఈ కార్యక్రమంలో శ్రియ పాల్గొన్నారు.













