5న వీరభోగ వసంత రాయులు విడుదల
వీరభోగ వసంత రాయులు విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది. టైటిల్ నుంచి కథ వరకూ అంతా ఆసక్తికరంగా ఉండబోతుందన్నారు. క్తొత మతం పుట్టుకొస్తుంది అనే ట్యాగ్‌లైన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు. త్వరలో ఆడియో విడుదల తేదీని ప్రకటించనున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండగా ఎస్ వెంకట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.













