వీరభోగవసంతరాయలు ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్లో ప్రస్తుతం మల్టీ స్టారర్ జోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరభోగవసంతరాయులు అనే టైటిల్‌తో ఇంద్రసేన ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రలతో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా శ్రియ లుక్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో శ్రియ సీరియస్ లుక్‌తో కనిపిస్తుంది. పెళ్లి తర్వాత శ్రియ చేయబోవు తొలి సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఆమె పాత్ర కూడా ముగ్గురు హీరోలకి సమానంగా ఉంటుందని అంటున్నారు. అప్పారావు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ..వసంత అనే పాత్రలో కనిపించనుందట. ఇదిలా ఉంటే ఇటీవల సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక అసుర ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్న తిప్పరా మీసం చిత్రంతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు.













