అప్పు ఏవి చూసి ఎమోషనల్ అయిన కన్నడ సూపర్ స్టార్…
కన్నడ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు శివ రాజ్ కుమార్. గత కొన్ని సంవత్సరాలుగా కన్నడ పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉంటూ సూపర్ స్టార్ గా ఎదిగారు ఈ హీరో. గత ఏడాది చివర్లో కన్నడలో ఈ హీరో నటించిన “వేద” సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా శాండల్ వుడ్ లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే అక్కడ హిట్టైన ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా వేద సినిమాకి సంబంధిన ప్రీరిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ వేదికగా వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా హీరో అయిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మరియు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేయడానికి బాలయ్య బాబు సపోర్ట్ అందించడం విశేషం. ఎన్నో ఏళ్లుగా ఈ సూపర్ స్టార్స్ మధ్య మంచి బాండింగ్ ఉండడంతో బాలకృష్ణ ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివ రాజ్ కుమార్ తమ్ముడైనటువంటి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఏవి ని ప్రదశించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా శివరాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. తన సోదరుడిని గుర్తు చేస్కుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న బాలకృష్ణ ఈ హీరో భుజంపై చేయి వేసి ఓదార్చారు. ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని శివరాజ్ కుమార్ ని ఓదార్చారు బాలయ్య. ఈ సంఘటనని చూసి అభిమానులు సైతం కంట తడి పెట్టారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. శాండల్ వుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.













