వేద్ నాలో కొత్త స్ఫూర్తిని నింపింది: జెనీలియా
బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన హీరోయిన్ జెనీలియా. కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ హిట్ సినిమాలు అందుకుంది ఈ అమ్మడు. ఢీ, రెడీ, బొమ్మరిల్లు సినిమాలు జెనీలియా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక హాసిని పాత్రలో ఈ ముద్దుగుమ్మ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ నే కాకుండా, కుర్రకారుని సైతం తన వెంట తిప్పుకుంది జెనీలియా. తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి తన లక్ ని పరీక్షించుకుంది.
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమ వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది జెనీలియా. తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. వీరి ప్రేమకి ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారితో టైం స్పెండ్ చేస్తూ మదర్ హుడ్ ని ఆస్వాదిస్తోంది జెనీలియా. ఇక ఈ తరుణంలో రీసెంట్ గా తన హస్బెండ్ అయిన రితేష్ దేశముఖ్ తో కలిసి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. గట్టి హిట్ కొట్టి ఇండస్ట్రీలో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఈ అమ్మడు.
తెలుగులో నాగ చైతన్య, సమంత కలిసి నటించిన మజిలీ చిత్రాన్ని రితేష్ దేశముఖ్ రీమేక్ చేయగా, ఈ చిత్రం లో రితేష్, జెనీలియా జంటగా నటించారు. వేద్ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టారు. ఈ సందర్భంగా ఈ అమ్మడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకున్నాను, నా పిల్లలకి నేను పూర్తి ప్రేమ అందించాలనుకున్నాను. అందుకే నటనకి దూరమయ్యాను. కానీ చాల రోజుల తర్వాత వేద్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. వేద్ సినిమా నాలో కొత్త స్ఫూర్తిని నింపింది. మంచి కథ దొరికితే మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తాను “. అని జెనీలియా చెప్పుకొచ్చారు.













