VD15: అక్టోబర్ రెండో వారంలో రౌడీ జనార్ధన

గత కొన్ని సినిమాలుగా విజయ్ దేవరకొండ(vijay devarakonda)కు ఏం కలిసి రావడం లేదు. ప్రతీ సినిమాకీ కష్టపడటం, ఆ సినిమా తనకు మంచి హిట్ ఇస్తుందని ఆశ పడటం, తీరా రిలీజ్ తర్వాత రిజల్ట్ తో డిజప్పాయింట్ అవడం ఇదే జరుగుతూ వస్తుంది. కింగ్‌డమ్(kingdom) సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందనుకుంటే ఆ సినిమా కూడా విజయ్ కు నిరాశనే మిగిల్చింది.
ఇదిలా ఉంటే కింగ్‌డమ్ తర్వాత విజయ్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి గతంలో తనకు ట్యాక్సీవాలా(taxiwala) లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్య్సన్(rahul sankrityan) తో కాగా, రెండోది రాజా వారు రాణి గారు(raja varu rani garu) ఫేమ్ రవికిరణ్ కోలా(ravi kiran kola) దర్శకత్వంలో. ఈ రెండింటిలో ఆల్రెడీ రాహుల్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు విజయ్.
అయితే అక్టోబర్ రెండో వారంలో రవికిరణ్ కోలా సినిమాను కూడా లాంచ్ చేసి, ఆ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని విజయ్ చూస్తున్నాడట. కింగ్‌డమ్ సినిమాకు ఎక్కువ టైమ్ కేటాయించిన విజయ్, ఇకపై వేగంగా సినిమాలను చేయాలనే ఆలోచనతో రెండు సినిమాలను ఒకేసారి చేయాలని డిసైడయ్యాడట. విజయ్ కెరీర్లో 15(VD15)వ సినిమాగా రానున్న ఈ మూవీకి రౌడీ జనార్ధన(Rowdy Janardhana) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.