VD14: విజయ్ సైలెంట్ గా స్టార్ట్ చేశాడుగా!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎంత కష్టపడుతున్నా తన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పటికప్పుడు చేస్తున్న సినిమాపై ఆశలు పెట్టుకోవడం, ఆ సినిమాలు అతని ఆశలపై నీళ్లు చల్లడం.. గత కొన్ని సినిమాలుగా ఇదే జరుగుతూ వస్తుంది. కింగ్‌డమ్(Kingdom) సినిమా విజయ్ కెరీర్ ను మారుస్తుందనుకుంటే ఆ సినిమా కూడా అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.
అయితే కింగ్‌డమ్ సినిమా ఫలితాన్ని చూసి విజయ్ డల్ అయిపోయి బాధపడుతూ కూర్చోకుండా వెంటనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. విజయ్ లైనప్ లో పలు క్రేజీ సినిమాలుండగా అందులో రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityan) దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఒకటుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని పూజా కార్యక్రమాలు కూడా ఈ సినిమా పూర్తి చేసుకుంది.
వీడీ14(VD14)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాద్ లో అఫీషియల్ గా స్టార్ట్ అయిందని, మొదటి షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ లోనే చేసి, తర్వాత చిత్ర యూనిట్ రాయలసీమ ప్రాంతానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఈ సినిమాలో విజయ్ కు జోడీగా నటిస్తుండగా, రాహుల్- విజయ్ కలిసి గతంలో ట్యాక్సీవాలా(Taxiwala) అనే సినిమా చేశారు.