VD12 రీస్టార్ట్ అయ్యేదెప్పుడంటే?
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ ఇప్పటికే తన డబ్బింగ్ పార్ట్ ను కూడా ఫినిష్ చేశాడట.
త్వరలోనే సినిమా ప్రమోషన్స్ లో విజయ్ చిత్ర యూనిట్ తో కలిసి పాల్గొననున్నాడు. అయితే విజయ్ ఫ్యామిలీ స్టార్ తో పాటూ గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా మొదలుపెట్టాడు. కానీ మధ్యలో ఫ్యామిలీ స్టార్ కోసం గౌతమ్ సినిమాకు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే విజయ్ తన తర్వాతి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.
మార్చి చివరి నుంచి VD12 షూటింగ్ రీస్టార్ట్ కానుందట. కొత్త షెడ్యూల్ శ్రీలకంలో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ మొదటిసారిగా పోలీస్ రోల్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లోనే సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను అనుకున్నారు కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి మరొకరు రానున్నారంటున్నారు. ఏదేమైనా విజయ్ తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేయాల్సిన టైమ్ మాత్రం దగ్గర పడింది.













