Vasuki Anand: ఇప్పటికీ చదువుతున్నా

బుల్లితెర నటిగా టెలివిజన్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన వాసుకి ఆనంద్(vasuki anand) ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 23 టీవీ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి ప్రేమ (tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(pawan kalyan) కు సోదరిగా నటించి ఆ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వాసుకి ఆనంద్. తొలిప్రేమలో తన నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా నంది(Nandi Award) అవార్డును కూడా వాసుకి అందుకున్నారు.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ అన్నీ మంచి శకునములే(Anni manchi sakunamule) సినిమాతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాసుకి, పలు సినిమాలు, సిరీస్‌ల్లో నటించి తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించారు. గతేడాది ఫ్యామిలీ స్టార్(family star), 90స్(90s) వెబ్ సిరీస్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న వాసుకి, ఇప్పుడు తాజాగా బ్యూటీ(beauty) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
అంకిత్ కొయ్య(ankit koyya), నీలఖి(neelakhi) జంటగా వచ్చిన ఈ సినిమాలో వాసుకి కీలక పాత్రలో నటించగా, బ్యూటీ ప్రమోషన్స్ లో ఆమె యాక్టివ్ గా పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తనకు ఎంటర్‌ప్రెన్యూర్ అవాలనే కోరికతో ఫైనాన్స్& బ్యాంకింగ్ లో ఎంబీఏ చేశానని చెప్పిన వాసుకి, సైకాలజీపై ఇష్టంతో సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం పీహెచ్‌డీ చేస్తున్నానని, తానిప్పటికీ స్టూడెంట్‌నే అనే విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.