వరుణ్ తేజ్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ తనదైన శైలిలో కెరీర్ లో ముందుకి వెళ్తున్నాడు. ఇటు మాస్, అటు క్లాస్ అనే తేడా లేకుండా వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఫిదా సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ని బయటపెట్టాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు వరుణ్ తేజ్. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో మెగా ప్రిన్స్ ఒకరు. ఇప్పటివరకు వరుసగా హిట్స్ ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో.
వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా గని అనుకోని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ దెబ్బతో వరుణ్ తేజ్ అలెర్ట్ అయ్యాడనే చెప్పాలి. గీత ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా మినిమం కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మెగా ప్రిన్స్ కథల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తన నెక్స్ట్ సినిమాకి ఇంత టైం గాప్ వచ్చిందని తెలుస్తుంది. ఈ తరుణంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫుల్ గా కాన్సంట్రేషన్ చేస్తున్నాడట ఈ యంగ్ హీరో.
BVSN ప్రసాద్ ప్రొడ్యూసర్ గా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరో గా వస్తున్న ఫుల్ మాస్ బ్యాక్ గ్రౌండ్ సినిమా ” గాండీవధారి అర్జున “. యూనిక్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో సగానికి పైగా ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. రీసెంట్ గా యునైటెడ్ కింగ్ డమ్ లో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. లాస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన హోప్స్ అన్ని ఈ సినిమాపైనే పెట్టుకున్నాడని తెలుస్తుంది.













