బాక్సర్ గా వరుణ్ తేజ్ ?
ఈమధ్యే గద్దలకొండ గణేష్ గా అలరించారు వరుణ్ తేజ్. ఇప్పుడు బాక్సర్‌గా మారి సత్తా చూపించనున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీంతో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నారు వరుణ్. ఇటీవల వరుణ్‌కు వక్కంతం వంశీ ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కథ వరుణ్‌తేజ్‌కి నచ్చిందట. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించే అవకాశాలున్నాయి. రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు వంశీ. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారారు. కిరణ్ సినిమా పూర్తయిన వెంటనే వంశీ కథ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.













