సాయి పల్లవిని పెళ్లడతాను
తాజాగా గద్దలకొండ గణేష్‌తో సూపర్ హిట్ కొట్టాడు వరుణ్‌తేజ్. ముకుందలో తనకు జంటగా నటించిన పూజా హెగ్డే ఈ చిత్రంలో మరోసారి వరుణ్‌తో నటించింది. వరుణ్ కెరీర్లో మొదటి బ్లాక్‌బస్టర్ ఫిదాలో సాయి పల్లవి హీరోయిన్. ఫిదా తరువాత వచ్చి వరుణ్‌కి మరో హిట్ ఇచ్చిన తొలిప్రేమలో రాశిఖన్నా అతనితో జత కట్టింది. ఈ ముగ్గురు భామల్లో ఎవరిని పెళ్లాడతావు? ఎవరిని చంపుతావు? ఎవరిని డేటింగ్ కోసం తీసుకువెళతావు? అంటూ ఓ రియాల్టీ షో కోసం మంచు లక్ష్మి ప్రశ్నించింది వరుణ్ తేజ్‌ను. దానికి వరుణ్ ఇలా సమాధానం ఇచ్చారు. రాశిని చంపుతాను. పూజాను డేటింగ్‌కి తీసుకువెళ్తాను. సాయిపల్లవిని పెళ్లాడతాను.. అంటూ వరుణ్ బదులివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.













