వరుణ్ తేజ్ కి హెచ్ బీవో ఇండియా సర్ ఫ్రైజ్
మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఆశ్చర్యపరిచే బహుమతి అందింది. డీసీ కామిక్స్‌ను ఇష్టపడే వరుణ్‌కు.. ఆ సూపర్ హీరో బొమ్మ బహుమతిగా వచ్చాయి. వరుణ్‌కు డీసీ కామిక్స్ ఇష్టమని తొసుకున్న హెచ్‌బీవో ఇండియా ఆయన సూపర్ హీరో క్యారెక్టర్‌ను పంపించింది. ఈ బహుమతి అందుకున్న వరుణ్ స్పందిస్తూ.. నా దగ్గరకు కొందరు అరుదైన అతిథులు వచ్చారు. డీసీ సూపర్ హీరోపై నాకున్న ఇష్టాన్ని గుర్తించిన హెచ్‌బీవో ఇండియాకు కృతజ్ఞతలు అని ట్విట్టర్లో పోస్టు చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా బాక్సర్ చిత్రీకరణలో ఉన్నారు.













