అమెరికాలో వరుణ్ తేజ్ శిక్షణ!
వరుణ్‌తేజ్ సంక్రాంతికి ఎఫ్ 2 తో సందడి చేశారు. అందులో హైదరాబాదీ యువకుడిగా కనిపించారు. ప్రతి చిత్రానికి వైవిధ్యం చూపించే వరుణ్ తేజ్, ఎఫ్ 2 తర్వాత చేస్తున్న చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నారు. ఆయన కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రం నిర్మించనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది సినిమా. ఇందులో వరుణ్తేజ్ది బాక్సర్ పాత్ర. అందుకని, బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి అమెరికా వెళ్తున్నారు. అక్కడ ఓ ప్రొఫెషనల్ కోచ్ దగ్గర బాక్సింగ్‌లో మెళకువలు తెలుసుకోనున్నారు. అలాగే, పాత్ర కోసం ఫర్ఫెక్ట్ ఫిజిక్‌లోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ చిత్రానికి వరుణ్‌తేజ్ స్నేహితుడు సిద్దు సహ నిర్మాతగా వ్యవహరిస్తారని సమచారం.













