మళ్లీ ట్రాక్ తప్పిన వరుణ్
వరుణ్ తేజ్(Varun Tej) ఈ మధ్య ఏ సినిమా చేసినా కలిసిరావడం లేదు. గత కొన్ని సినిమాలుగా తన నుంచి వచ్చిన సినిమాలన్నీ పరాజయమవుతున్నాయి. రెండు వారాలుగా గ్యాప్ తీసుకోకుండా పలు రాష్ట్రాలు తిరిగి ప్రమోట్ చేసిన మట్కా(Matka) సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ లభించాయి. మరీ దారుణంగా కోటి రూపాయల షేర్ కూడా రాకపోవడం ఫ్యాన్స్ కు షాక్ ని కలుగచేసింది.
కనీసం మెగా ఫ్యాన్స్ సగం మంద చూసినా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి కానీ మట్కా వారిలో కూడా ఇంట్రెస్ట్ కలిగించలేకపోయింది. కనీసం మెయిన్ సెంటర్లలో కూడా మార్నింగ్ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు. డైరెక్టర్ కరుణ కుమార్(Karuna Kumar) చెప్పిన మాటలు మాటలకే పరిమితమయ్యాయి కానీ చేతల్లో చూపించలేకపోయాడు.
ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఇంత పెద్ద బడ్జెట్ ను వేస్ట్ చేసినట్లు స్క్రీన్ మీద కనిపించింది. అనసరమైన సాంగ్స్, ఇంట్రెస్ట్ లేని ట్విస్టులు అన్నీ హై అనిపించే ఎపిసోడ్స్ లేకపోవడం, రొటీన్ ట్రీట్మెంట్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ మరోసారి ట్రాక్ తప్పాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













