అమెరికాలో వరుణ్‌తేజ్ శిక్షణ
వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్దుముద్ర, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయా మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. జులై 30న ఈ సినిమా విడుదల చేయడానికి ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని వరుణ్ చాలా మేకోవర్ అయ్యారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. తొలి షెడ్యూల్‌ను వైజాగ్‌లో 15 రోజుల పాటు చిత్రీకరించాం. హీరోయిన్ సయా మంజ్రేకర్‌తో పాటు నవీన్‌చంద్ర, నదియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.













