Varun Tej: వరుణ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్?
మట్కా(Matka) సినిమాతో ఘోరమైన ఫ్లాప్ ను మూటగట్టుకున్న వరుణ్ తేజ్(Varun Tej) కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express) ఫేమ్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్ ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి లో సెట్స్ పైకి వెళ్తుందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుందని, దీని కోసం వరుణ్ రాయలసీమ యాస నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడట. హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్న వరుణ్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం. మరోవైపు మేర్లపాక గాంధీ కూడా సరైన ట్రాక్ లో లేడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్(Like Share Subscribe) తర్వాత గాంధీ సినిమాలు చేయకుండా ఈ ప్రాజెక్టు పైనే ఉన్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా వర్క్ చేసిన గాంధీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













