VT15: కొత్త షెడ్యూల్ కోసం కొరియాకు వరుణ్

గత కొన్ని సినిమాలుగా వరుణ్(Varun Tej) ఏ సినిమా చేసినా అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగానే నిలుస్తున్నాయి. ఫలితంగా వరుణ్ మార్కెట్ బాగా దెబ్బ తింటుంది. కాబట్టి ఎలాగైనా వరుణ్ ఇప్పుడు త్వరగా ఓ హిట్ అందుకోవాలి. దాని కోసం వరుణ్ ఈసారి మేర్లపాకి గాంధీతో కొరియన్ కామిక్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. వరుణ్ కెరీర్లో 15(VT15)వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి కొరియన్ కనకరాజు(Korean Kanakaraju) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
రీసెంట్ గా భార్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో కలిసి మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి తిరిగొచ్చిన వరుణ్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి కొరియా వెళ్లాడు. తాజా సమాచారం ప్రకారం కొరియన్ కనకరాజు కొత్త షెడ్యూల్ ఇవాళ నుంచి కొరియాలో ప్రారంభం కానుందని, ఈ కొత్త షెడ్యూల్ 45 రోజుల పాటూ ఉండనుందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 90% వరకు పూర్తవుతుందని, ఆ తర్వాత పెండింగ్ షూటింగ్ ను హైదరాబాద్ లో పూర్తి చేయనున్నట్టు సమాచారం. కొరియన్ కనకరాజును ఎలాగైనా ఆగస్ట్ నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి కొత్త సినిమాను మొదలుపెట్టాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నాడు. రితికా నాయక్(Rithika Nayak), సత్య(satya) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తున్నాడు.