Varun Tej: ఆ డైరెక్టర్ తో వరుణ్ సినిమా
గత కొన్ని సినిమాలుగా మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) ఎంత కష్టపడుతున్నా ఆ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. కెరీర్ లో సరైన హిట్ లేక సతమతమవుతున్న వరుణ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వంలో హార్రర్ కామెడీ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు కొరియన్ కనకరాజు(Corian Kanakaraju) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రితికా నాయర్(rithika nair) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాధేశ్యామ్(radhe shyam) డైరెక్టర్ రాధాకృష్ణ(Radha krishna)తో ఓ ప్రేమ కథ చేయడానికి వరుణ్ ఒప్పుకున్నాడని సమాచారం.
రాధేశ్యామ్ తో ఫ్లాపు అందుకున్న రాధాకృష్ణ ఆ సినిమా తర్వాత మరో సినిమా చేసింది లేదు. మధ్యలో గోపీచంద్(gopichand) తో సినిమా చేస్తాడన్నారు కానీ ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గానే రాధాకృష్ణ, వరుణ్ కు కథ చెప్పాడని, ఆ కథ వరుణ్ కు బాగా నచ్చి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.






