క్రిష్ తో వరుణ్ మూవీ
భిన్న కథలతో సినిమాలు చేసే డైరెక్టర్ గా క్రిష్ జాగర్లమూడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పవన్ తో మూడేళ్ల కిందట హరిహర వీరమల్లుని స్టార్ట్ చేసిన క్రిష్, ఆ సినిమా ఎంతకీ పూర్తవకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఓ వైపు డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజీవ్ రెడ్డితో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు క్రిష్. ఇప్పుడు ఈ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కంప్లీట్ కామిక్ బేస్డ్ జానర్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది.
త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలుకానున్నాయని, నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్, కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. బడ్జెట్ కారణంగా ఈ సినిమా కొంతకాలంగా ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ సమస్యలు తీరి తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మట్కా రిలీజ్ కాగానే క్రిష్ నిర్మాతగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ సినిమా స్టార్ట్ కానున్నట్లు సమాచారం.













