వరుణ్ సినిమాకు బడ్జెట్ ఇష్యూస్
ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు ఆడటం లేదు. ఏ సినిమాలోనైనా కంటెంట్ ఉంటేనే అవి హిట్ అవుతున్నాయి. డబ్బులొస్తున్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సినిమాకు దారుణమైన నష్టాలొస్తున్నాయి. అంతేకాదు ఆ ఎఫెక్ట్ సదరు హీరో నటించే సినిమాలపై కూడా పడుతుంది. గత కొన్ని సినిమాలుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి ఇలానే ఉంది.
వరుణ్ నుంచి వచ్చిన రీసెంట్ సినిమాలు ఫ్లాపులు కావడంతో ఆ సినిమాల ప్రభావం ఇప్పుడు తను నటిస్తున్న సినిమాలపై పడుతుంది. గద్దల కొండ గణేష్ తర్వాత వరుణ్ చేసిన ఏ సినిమా మంచి టాక్ తెచ్చుకోకపోవడంతో వరుణ్ మార్కెట్ బాగా దెబ్బతింది. కనీసం పెట్టిన డబ్బుల్లో సగం కూడా వరుణ్ రాబట్టలేకపోయాడు.
ఈ కారణంగా వరుణ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ బజ్ లేక పోస్ట్ పోన్ అవుతుంటే, మరో సినిమా షూటింగ్ దశలోనే బడ్జెట్ విషయం వల్ల బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న మట్కా అనే పీరియాడిక్ మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతున్న కారణంగా మరోసారి ఆలోచించి బడ్జెట్ పెరగకుండా ఉండేందుకు నిర్మాతలు దర్శకుడికి జాగ్రత్తలు చెప్తున్నట్లు సమాచారం.













