భారీ రేటుకు మట్కా ఆడియో రైట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మట్కా. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. పీరియాడిక్ జానర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా కథాంశం 1952-1982 మధ్యలో ఉంటుందట. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ కూడా మూడు వేరియేషన్స్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అదిరిపోయే ఎలివేషన్స్ తో పాటూ పవర్ఫుల్ సాంగ్స్ ను కూడా జీవీ మట్కా కోసం కంపోజ్ చేస్తున్నాడని సమాచారం. అయితే మట్కా మ్యూజిక్ రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా పోస్టర్ ద్వారా తెలిపింది.
దీనికి గాను ఆదిత్య మ్యూజిక్ మట్కా మేకర్స్ కు రూ.3.6 కోట్లు చెల్లించిందట. ఓ విధంగా వరణ్ ఇమేజ్, మార్కెట్ తో పోలిస్తే మట్కా ఆడియో భారీ రేటు పలికినట్లే. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో వరుణ్ మాఫియా డాన్ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. అతని ముందు డబ్బుల కట్టలు కూడా పడున్నాయి. మొత్తానికి కరుణ్ కుమార్ మట్కాతో ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడనైతే అర్థమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ కు జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు.













