అల్లు వారి ఇంట వరుణ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ పార్టీ..
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్న సంగతి, దానితో పాటు వారి ఇరువురి కుటుంబాల అంగీకారం కూడా లభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో వరుణ్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ దంపతులు కాబోయే నూతన వధూవరులను అభినందిస్తూ మరొక పార్టీని ఏర్పాటు చేసారు.
అయితే అల్లు అర్జున్ దంపతులు ఏర్పాటు చేసిన ఈ పార్టీకి కొంతమంది గెస్ట్ లు కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను అభినందించడానికి అల్లు అరవింద్ కుటుంబంతో పాటు హీరో నితిన్ అతని భార్య షాలిని , రీతువర్మ వీరితో పాటు పలువురు స్నేహితులు కూడా ఈ పార్టీకి హాజరయ్యి సందడి చేసారు. ఈ పార్టీలో ఫొటోస్ కొన్ని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ని చూసి మెగా అభిమానులు వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మిస్టర్ సినిమాతో వరుణ్, లావణ్యల ప్రయాణం మొదలైందని చెప్పాలి. మొదట ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నా వారి అభిప్రాయాలు కలవడంతో ‘అంతరిక్షం’ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ లావణ్యకి తన మనసులోని మాట చెప్పాడు. దానికి సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది లావణ్య.
ఆ తరువాత ఇద్దరి కుటుంబాలు వీరి నిర్ణయాన్ని ఆమోదించాయి. వీరి నిశ్చితార్ధాన్ని కూడా చాలా సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా చేసారు. ఇక ఇప్పుడు పెళ్లి కూడా ఇటలీలోని టస్కాలో జరగనున్నది. నవంబర్ 1వ తేదీన వివాహం జరగనుందని సమాచారం. మరి పెళ్లికైనా పెద్ద సంఖ్యలో హాజరు అవుతారా లేదా అన్నదాని గురించి సరైన సమాచారం లేదు.













