వచ్చే నెలలో వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్.. నిజమెంత
కలిసి సినిమాలు చేసిన హీరో హీరోయిన్ వ్యక్తిగతంగ దగ్గరై, తర్వాత ఒకటిగా మారిన ఉదంతాలు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు- నమ్రత, నాగచైతన్య-సమంత ఇలా ఇప్పుడు మరో జంట టాలీవుడ్ లో ఒక్కటవబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మిస్టర్, అంతరిక్షం లాంటి ఫ్లాప్ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది.
కానీ ఇప్పటివరకు ఈ విషయంలో వీళ్లద్దరిలో ఎవరూ ఓపెన్ అయి తమ ప్రేమ గురించి చెప్పింది లేదు. ఓ దశలో వీళ్ళిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత నాగబాబు క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే తన కొడుక్కి పెళ్లి చేయబోతున్నట్లు నాగబాబు అనౌన్స్ చేశాడు. కానీ ఆ టైమ్ అయితే ఇంకా రాలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వరుణ్, లావణ్య ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారని, ఇద్దరి కుటుంబాలు దానికి అంగీకరించాయని ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోకున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. లావణ్య మెగా ఫ్యామిలీలో కొన్ని ఈవెంట్స్ లో పాల్గొనడంతో వరుణ్ కు, లావణ్యకు మధ్య ప్రేమ ఉందని గుసగుసలు మొదలయ్యాయి తప్పించి వీరిద్దరూ కలిసి ఎక్కడా బయట కనిపించింది లేదు. ఏదేమైనా సరే వీరి జంట గురించి రూమర్లయితే ఆగట్లేదు. ఈసారి ఏకంగా ఎంగేజ్మెంట్ అనేశారు వార్త రాయుళ్లు. చూడాలి ఏమవుతుందో.













