రిస్క్ చేస్తున్న వరుణ్
టాలీవుడ్ లో ఈ డిసెంబర్ కు చాలానే సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వాటి గురించి అప్పుడే చర్చలు కూడా బాగా ఎక్కువయ్యాయి. డిసెంబర్ 7న నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమా రిలీజ్ కానుండగా, 8వ తేదీన మరో మూడు సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అవే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆపరేషన్ వాలెంటైన్ అనే మూడు సినిమాలు డిసెంబర్ 8వ తేదీనే రిలీజ్ అవుతున్నాయి.
వీటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎక్స్ట్రా మూవీల్లో ఏదొక దాన్ని వాయిదా వేయించేందుకు ఇండస్ట్రీ పెద్దలు ట్రై చేస్తున్నారని సమాచారం. విశ్వక్సేన్, నితిన్ ఇద్దరూ కూడా కెరీర్ పరంగా ఈక్వల్ కానప్పటికీ కంటెంట్, బడ్జెట్ దృష్ట్యా చూస్తే వేటికవే స్పెషల్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఏదీ వెనక్కు తగ్గకపోతే ఆ రిస్క్ మాత్రం ఎక్కువగా వరుణ్ తేజ్ సినిమాపై పడనుంది.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఎయిర్ఫోర్స్ సాహసాలను ఆధారంగా చేసుకుని, దానికి లవ్ స్టోరీని యాడ్ చేసి తెరకెక్కించారు. ఈ సినిమాకు ఇంకా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయలేదు కాబట్టి సినిమా ఎలా ఉంటుందనేది ఆడియన్స్ కు మినిమం అవగాహన లేదు. దానికి తోడు ఈ జానర్ మాస్ ఆడియన్స్ కు ఎక్కేది కాదు. మరి అలాంటప్పుడు వరుణ్ సోలోగా రాకుండా డిసెంబర్ నెలలో అది కూడా ఇంత పోటీ మధ్యలో వచ్చి రిస్క్ తీసుకోవడం ఎందుకనేది ఆలోచించుకుంటే బెటర్.













