లవ్ స్టోరీ చేయనున్న వరుణ్
గత కొన్ని సినిమాలుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సరైన సక్సెస్ లేదు. ప్రయోగాల పేరుతో కొత్తగా ట్రై చేద్దామని చూస్తుంటే ఆ సినిమాలన్నీ వరుణ్ కు డిజాస్టర్లనే మిగులుస్తున్నాయి. దీంతో వరుణ్ మార్కెట్ రిస్క్ లో పడింది. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్లయ్యాయి. ఈ ఫ్లాపుల ఎఫెక్ట్ వరుణ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న మట్కాపైన పడుతుంది. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే వరుణ్ ప్రస్తుతం ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పాడనే వార్త నెట్టింట వినిపిస్తోంది. దానికి కారణం వరుణ్ ఖాతాలో మంచి సక్సెస్లు అందుకున్న ఫిదా, తొలి ప్రేమ సినిమాలు ఆ జానర్ కు చెందిన సినిమాలే కావడం.
అయితే వరుణ్ లవ్ స్టోరీ చేస్తున్నాడని ఫ్యాన్స్ సంతోషించే లోపే ఆ సినిమాకు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ అని తెలిసి నిరాశ పడుతున్నారు. రవితేజ హీరోగా టచ్ చేసి చూడు సినిమా చేసి డిజాస్టర్ అందుకున్న విక్రమ్, ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుణ్ తో సినిమా చేయనున్నాడు. కథ చాలా కొత్తగా, డిఫరెంట్ గా వచ్చిందని, అందుక విక్రమ్ గత సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా వరుణ్ ఈ ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. అంతే కాదు ఈ సినిమాను నిర్మిస్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్. మైత్రీ నిర్మాతలు అంత ఈజీగా సినిమాలను ఒప్పుకోరు. వాళ్లు ఓకే చేశారంటే సినిమాలో ఏదో గట్టి మ్యాటర్ ఉన్నట్లే. మరి విక్రమ్, వరుణ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.













