వరుణ్ ఇక జాగ్రత్త పడాల్సిందే!
ముకుంద అనే వైవిధ్యమైన సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్, ఆ తర్వాత ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 లాంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. ఈ సక్సెస్ లతో వరుణ్ తన కెరీర్ ను మంచి రేంజ్ కు తీసుకెళ్తాడనుకుంటే సరైన సినిమాలు ఎంచుకోక డిజాస్టర్లతో ఫామ్ కోల్పోతున్నాడు. రెండేళ్ల నుంచి వరుణ్ కెరీర్ దారుణంగా డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది.
ఫలితంగా వరుణ్ మార్కెట్ తగ్గిపోతుంది. గని సినిమాతో వరుణ్ కెరీర్ కు చాలా పెద్ద బ్రేకే పడింది. అసలు వరుణ్ ఆ సినిమా ఎందుకు చేశాడన్నది ఇప్పటికీ అర్థం కాదు. ఎఫ్3 సినిమా ఏదో ఆడింది తప్పించి ఎఫ్2లా మెప్పించలేకపోయింది. తక్కువ గ్యాప్ లోనే రెండు ఫెయిల్యూర్లు వరుణ్ ఖాతాలో పడ్డాయి. ఇక గతేడాది వచ్చిన గాండీవధారి అర్జున గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్.
ఇంతకుముందు సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి గాండీవధార సినిమాకు ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. దీంతో వరుణ్ మార్కెట్ ఏ విధంగా డౌన్ ఫాల్ అయిందో అందరికీ బాగా అర్థమైంది. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం వరుణ్ ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ రాలేదు. మౌత్ టాక్ కూడా ఏమంత గొప్పగా లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పటికైనా వరుణ్ మంచి కథా బలమున్న సినిమాలు చేస్తే తన మార్కెట్ పెరిగే అవకాశముంటుంది.













