ఆ పాత్ర స్పూర్తితో మట్కాలో వరుణ్ పాత్ర
కొత్తగా ట్రై చేద్దామని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) చేస్తున్న ప్రయోగాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి బెడిసి కొడుతున్నాయి. గని(Gani), గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna), ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా సగటు ప్రేక్షకులకు తెలియలేదు. వరుస ఫ్లాపుల వల్ల వరుణ్ మార్కెట్ చాలా దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం వరుణ్ తేజ్, పలాస(Palasa) ఫేమ్ కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వంలో మట్కా(Matka) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మొదలైనప్పుడు వరుణ్ అనవసరంగా రిస్క్ చేస్తున్నాడని రకరకాల వార్తలొచ్చాయి. కానీ రీసెంట్ గా రిలీజైన టీజర్ మెగా ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ లోనూ ఇంట్రెస్ట్ ను పెంచింది. 60 నుంచి 90 దశకం మధ్యలో సౌత్ ను ఊపేసిన ఓ రియల్ లైఫ్ మట్కా డాన్ జీవిత కథ ఆధారంగా ఈ గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో యువకుడి నుంచి ముసలి వయసు వరకు వరుణ్ ను డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్నారు.
ఓ రకంగా చెప్పాలంటే మట్కా కోసం డైరెక్టర్ కరుణ్ కుమార్ నాయకుడు(Nayakudu Movie) సినిమా ఫార్ములాని వాడుకున్నట్లు అనిపిస్తోంది. అందులో వీరయ్య నాయుడు లానే మట్కాలో వైజాగ్ వాసు జర్నీని చూపించనున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి మట్కా సినిమాతో వరుణ్ కరెక్ట్ లైన్ లో పడ్డాడనే అనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు కాబట్టి కంటెంట్ కనెక్ట్ అయితే హిట్ పక్కా. మట్కా కోసం ఎంతో కష్టపడ్డ వరుణ్, దీనిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.













