‘దాడి’ మొదలైంది
వరుణ్‌సందేశ్, జీవన్, చరిష్మా, కారుణ్య చౌదరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం దాడి. మధు శోభ.టి దర్శకుడు. ఎ.శంకర్, టి.జయరాజు నిర్మాతలు. హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరాం కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు శివాజీరాజా క్లాప్‌నిచ్చారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఏడాది పాటు యు.ఎస్‌లో ఉండి, ఇక్కడికొచ్చాక ఒప్పుకున్న సినిమా ఇది. చంద్రమాహేష్ దర్శక్వంలో మరో చిత్రంలో నటించనున్నానని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ యువకుడు చిన్నప్పుడు అతని ఊళ్లో జరిగిన దాడిలో కుటుంబాన్ని కోల్పోతాడు. తను పెద్దయ్యాక కూడా అలాంటి దాడులే జరిగితే వాటి వెనుక చీకటికోణాన్ని అతడు ఎలా బయటపెట్టాడనేదే ఈ కథ అని అన్నారు.













