కల్యాణ్ రామ్ చిత్రానికి టైటిల్ ఖరారు
కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. గుహన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి 118 అనే టైటిల్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. కథాపరంగా 118 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ పేరు ఖాయం చేస్తున్నట్లు తెలిసింది. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ తన కెరీర్ కొనసాగిస్తూ వస్తున్నారు. పటాస్ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితం తేలిపోయింది. సోదరుడు ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మించిన విషయం తెలిసిందే.













