లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్‌కుమార్
గోపీచంద్ మలినేని, మస్మహారాజ రవితేజ కాంబినేషన్లో రాబోతున్న క్రాక్ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ లేడి విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఏదో మెయిన్ విలన్ చాటు లేడి విలన్లా కాకుండా.. ఆమె కూడా మెయిన్ విలన్‌గానే చేస్తోందట. తన భర్తను చంపిన హీరోపై పగ బట్టిన లేడీ పాత్రలో ఆమె చాలా బాగా నటిస్తోందని అంటున్నారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.













