నెగిటివ్ రోల్స్ తో ఇంప్రెస్ చేసి ఆఫర్స్ కొట్టేస్తున్న బ్యూటీ
నటి, నటుడు ఎవరైనా సరే.. కేవలం గ్లామర్ షో, ఒక రకమైన జోనర్ సినిమాలు చేయడమే కాదు ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీగా ఉండాలి. ఈ రూల్ ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది వరలక్ష్మీ శరత్ కుమార్. అలనాటి హీరోయిన్స్ తరహాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేయడానికి సిద్ధపడుతుంది వరలక్ష్మీ.
పందెం కోడి2, తెనాలి రామకృష్ణ సినిమాల్లో లేడీ విలన్ గా కనిపించి అందరినీ తన నటనతో ఆశ్చర్యపరిచింది. ఇక మొన్న ఈ మధ్య వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ గా కనిపించి మెయిన్ విలన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. నిన్న రిలీజ్ అయిన నాంది లో కూడా ఈ అమ్మడుకు హీరో రేంజ్ క్యారెక్టర్ దక్కింది. ఈ రేంజ్ లో వరలక్ష్మి టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఒక కీలక పాత్రను వరలక్ష్మికి ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాదు సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రానున్న మూవీలో కూడా ఈ బ్యూటీకి ఆఫర్ వచ్చిందని టాక్. అసలు ఏది ఏమైనా ప్రస్తుతానికి సౌత్ లో నెగిటివ్ రోల్ చేసే ఏకైక హీరోయిన గా వరలక్ష్మి పేరు సంపాదించుకుంది.













