ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
సీనియర్ నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన వరలక్ష్మిశరత్‌కుమార్ ఇటు హీరోయిన్‌గానే కాకుండా అటు వైవిధ్యమైన పాత్రలను పోషించే నటిగా మంచి గుర్తింపుపొందింది. తాజాగా సోషల్‌మీడియాలో ఆమె పెళ్లి ప్రస్తావనపై వస్తున్న కామెంట్స్‌పై సీరియస్ అయ్యింది. అవి అన్ని రూమర్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని సృష్టం చేసింది. తానూ నటిగా ఇంకా ఎదగాలని, ఇప్పట్లో తనకు పెళ్లిచేసుకునే ఆలోచన లేదని, ఇలాంటి రూమర్లు నమ్మాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఆమె విశాల్ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన పందెంకోడీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల 18న తెలుగ, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.













