కొత్త తరం కథతో వస్తున్న ‘తత్వమసి’
రోగ్ ఫేమ్ ఇషాన్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తత్వమసి. ఈ చిత్రం ద్వారా రచయిత రమణ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్ఈఎస్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ పతాకంపై రాధాకృష్ణ తేలు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను విడదుల చేశారు. హై ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న చిత్రమిది. న్యూ ఏజ్ స్టోరీతో తప్పకుండా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం స్యామ్ సీఎస్, కెమెరా: ర్యామ్ కె. నాయుడు.













