ట్రాన్స్‌జెండర్ లపై కాస్త దయ చూపండి అంటూ వేడుకుంటున్న తమిళ్ స్టార్స్ బిడ్డ
కరోనా వైరస్ ఎందరో జీవితాలను చిధిమేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఎంత పెద్ద సంస్థ అయినా సరే అర్ధ జీతంతో సరిపెట్టుకోండని లేదంటే ఉద్యోగాలు మానేయండని చెప్పేస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదురించేందుకు విధించిన లాక్ డౌన్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఆ సమయంలో ఎంతో తిండి లేక అల్లలాడిపోయారు. ఎంతో మంది ఆకలికేకలతో అలమటిస్తున్నారు. ఇప్పటికీ లాక్ డౌన్ దెబ్బ తగ్గడం లేదు ప్రభుత్వం ఆఫీషియల్ గా లాక్ డౌన్ పెట్టకపోయినా వాలెంటిరిగా ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై తిండికి కూడా కొట్టుమిట్టాడుతున్న వారి తరపున వరలక్ష్మీ శరత్ కుమార్ నిలిచింది. తండ్రి శరత్ కుమార్ ట్రాన్సజెండెర్ గా నటించడం కూతురు వర లక్ష్మి వారి తరపున నిలపడటం యాదృచ్చికం.
ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడే కార్యకర్త గ్రేస్ భాను అనే ట్రాన్స్‌జెండర్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతో శ్రమిస్తోందని తెలిపింది. తూత్తుకుడిలోని ఎంతో మందికి సాయం చేస్తూ నిర్విరామంగా పని చేస్తోందని చెప్పుకొచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసర సరకులు, మందులు అందిస్తోందని పేర్కొంది. మొదటగా క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సాయం చేయడం జరిగిందని తెలిపింది. కానీ ఇప్పుడు నిధులు అయిపోయాయని, మీ అందరి సాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. వారి ఇంటి అద్దె, రేషన్ కోసం సాయం చేయండని కోరింది. తమిళ నాడులో ఉన్న దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్స్లకు సాయం చేయండని పిలుపునిచ్చింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు విధించిన మూడు నెలల లాక్ డౌన్ పూర్తయ్యాక వారి యోగక్షేమాలను గాలికొదిలేశారు. ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదు. ఇంటి యజమానులు అద్దెలు అడగడం మానలేదు. రేషన్ కూడా వారికి అందడం లేదు. వారికి పైగా ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా ఉండవు.
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వృద్దులు, హెచ్ఐవీ రోగులు, జానపద కళాకారులు ఇలా ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయినవారెంతో మంది ఉన్నారు. వీధి కార్మికుల జీవితాలు కూడా దుర్భరంగా ఉన్నాయి. వీరందరినీ కాపాడేందుకు మీకు తోచిన మొత్తం అది కొంచమే అని మీకు అనిపించినా పర్లేదు.. ఎంతో కొంత సాయం చేయండని కోరింది. వారు కూడా మనుషులే కాస్త దయచూపండని, మానవత్వాన్ని చాటుకోండని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.













