NBK#107 లో ముఖ్యపాత్ర కోసం వరలక్ష్మి శరత్కుమార్ ఎంపిక అప్డేట్ అధిరిందిగా!!

బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా NBK#107 పై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విషయమై మరో క్రేజీ అప్‌డేట్ బయటకు రావడంతో ఆయన అభిమానులు హుషారెత్తిపోతున్నారు. నందమూరి నటసింహం వేట మొదలు కాబోతోంది అంటూ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ చేశామని ఆ మధ్య మైత్రి మూవీ నిర్మాతలు చెప్పడంతో అప్పటినుంచి ఈ ప్రాజెక్టు వివరాల కోసం ఆతృతగా ఎదురు చూశారు నందమూరి ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ అధికారికంగా ప్రకటించడంతో ఆయన అభిమానులు హుషారెత్తిపోయారు. వేట మొదలు అంటూ సింహానికి ప్రతీకగా బాలయ్య బాబును చూపిస్తూ NBK#107 మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. రీసెంట్‌గా గోపీచంద్ మలినేని రూపొందించిన క్రాక్ సినిమాలో జయమ్మగా అలరించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ రోల్ బాగా అట్రాక్ట్ చేయడంతో బాలయ్య సినిమాలో ఆమెకు మరో పవర్‌ఫుల్ రోల్ ఇచ్చారని సమాచారం. కాగా, NBK#107లో భాగమవుతున్న సందర్భంగా తన ఫీలింగ్స్ బయటపెట్టింది వరలక్ష్మి. తనకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఎప్పుడెప్పుడు సెట్‌లోకి అడుగుపెట్టాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పింది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని, ఇందులో బాలయ్య బాబు పవర్‌ఫుల్ మాస్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్.