Varalakshmi Sarathkumar: పెళ్లి చేసుకోకూడదనుకున్నా: వరలక్ష్మీ శరత్‌కుమార్
శరత్ కుమార్(Sarath kumar) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi sarathkumar) తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హనుమాన్ సినిమా తర్వాత వరలక్ష్మికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరిగింది. దీంతో పలు భాషల నుంచి వరలక్ష్మికి సినీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే గతేడాది వరలక్ష్మి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
తనకు ఎప్పట్నుంచో పరిచయమున్న నికోలయ్ సచ్దేవ్(Nikolay Sachdev)ను వరలక్ష్మి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో సంతోషంగా ఉన్నా అంటున్న వరలక్ష్మి, ముందు తనకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదని, పెళ్లనేది తనకసలు సెట్ కాదనుకునేదాన్నని చెప్తోంది. కానీ నికోలయ్ పరిచయమయ్యాక అతనే తన కరెక్ట్ పార్టనర్ అనిపించిందని అందుకే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది.
అయితే పెళ్లి తర్వాత అందరిలా తన జీవితం మారుతుందుకున్నానని, కానీ పెళ్లికి ముందున్నట్టే తన లైఫ్ ఇప్పుడు కూడా ఉందని, పెద్దగా మార్పులేమీ రాలేదని అంది. కానీ తన భర్త నికోలయ్ లైఫ్ లో మాత్రం చాలా మార్పులొచ్చాయని, ఆయన తన కోసమే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడని, అతని పేరుని కూడా నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్ గా మార్చుకున్నారని వరలక్ష్మీ ఈ సందర్భంగా తెలిపింది.













