ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్
ఏదో అనుకుని సినీ పరిశ్రమలోకి వస్తే ఆఖరికి మరేదో అవుతారు. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కోలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవాలని ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీ ఆమెను విలన్ గా గుర్తించింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే వరలక్ష్మి బాగా సెట్ అవుతుందని భావించి అలాంటి అవకాశాలతోనే దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు.
కొన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ వరలక్ష్మికి నెగిటివ్ పాత్రలే బాగా సూటవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో వరలక్ష్మి చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె మాటల్ని బట్టి అర్థమవుతుంది. మొదట్లో ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్లాలనుకున్న వరలక్ష్మి ఇప్పుడు కెరీర్ విషయంలో ప్రణాళికలు వేసుకువడమే మానేసిందట. భవిష్యత్తులో కూడా కెరీర్ గురించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోనని చెప్తోంది వరలక్ష్మి.
ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి తాను అనుకున్నదేదీ జరగలేదని, లైఫ్ లో ఏం జరిగిపోవాలనుంటే అది జరిగిపోతుందని, నిర్ణయాలు కాలానికే వదిలేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు అమ్మడు కెరీర్ విషయంలో ఎలాంటి డ్రీమ్ రోల్స్ కూడా పెట్టుకోలేదని చెప్తోంది. శరత్ కుమార్ కొన్ని సలహాలిస్తారని చెప్పిన వరలక్ష్మి, వాటిని లెక్కలోకి తీసుకోవాలనిపిస్తే తీసుకుంటా, లేకపోతే లేదని చెప్పుకొచ్చింది. తనకు ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఏ పాత్ర తన దగ్గరికొచ్చినా భాషతో సంబంధం లేకుండా చేస్తున్నట్లు తెలిపింది వరలక్ష్మి.













