ముచ్చటగా మూడోసారి కూడా విడాకులు తీసుకోబోతోందా?
కొంతమంది హీరోయిన్ల జీవితాలు ఎప్పుడూ వివాదాలతో నిండిపోయి ఉంటాయి. ఏదో ఒక వివాదంతో వార్తల్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో తమిళ నటి వనిత ఒకరు. విజయ్‌కుమార్, మంజుల పెద్ద కుమార్తె అయిన వనిత పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు. కానీ, పలు వివాదాల్లో, పెళ్లి విషయంలో, బిగ్‌బాస్ షోతో బాగా పాపులర్ అయింది. 1999లో తెలుగులో వచ్చిన `దేవి` చిత్రంలో నటించిన వనిత ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. 2000 సంవత్సరంలో ఆకాశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న వనిత అతనితో విభేదాలు రావడంతో 2007లో విడాకులు తీసుకుంది. అదే సంవత్సరం ఆనంద్ జయరాజన్‌ను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఆమె సంసారం సజావుగా సాగలేదు.
2012లో అతన్నుంచి కూడా విడిపోయి విడాకులు తీసుకుంది వనిత. 2013 నుంచి 2017 వరకు రాబర్ట్ అనే వ్యక్తి ఆమెకు లైఫ్ పార్టనర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2020లో పీటర్ పాల్‌ను వివాహం చేసుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్ళి చేసుకున్నాడంటూ పీటర్ భార్య కేసు పెట్టింది. దాని నుంచి ఎలాగోలా బయటపడిన పీటర్ కొద్దికాలానికే ఆనారోగ్యానికి గురయ్యాడు. పీటర్, వనిత మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం భర్త, పిల్లలతో కలిసి గోవా వెళ్లింది వనిత. ఈ ట్రిప్‌లోనే వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. అతిగా తాగిన పీటర్ వనితపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. అతిగా తాగుతున్నాడనే కారణం వల్ల పీటర్‌ను వనిత ఇంటి నుంచి గెంటేసిందని చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి మూడో భర్తకు కూడా విడాకులు ఇవ్వడానికి వనిత సిద్ధమవుతోందనే వార్త వినిపిస్తోంది.













