Vani Kapoor: వైట్ డ్రెస్ లో వాణీ గ్లామరస్ పోజులు
శుద్ధ్(Suddh) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కపూర్ గర్ల్ వాణీ కపూర్(Vani Kapoor) బాలీవుడ్ మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో నాని(Nani) హీరోగా వచ్చిన ఆహా కళ్యాణం(Aha Kalyanam) సినిమాలో కూడా వాణీ కపూర్ నటించింది. బాలీవుడ్ లో అమ్మడికి మంచి గుర్తింపే ఉంది. సోషల్ మీడియాలో వాణీ కపూర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తన అందాల ఆరబోత ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకునే వాణీ కపూర్ తాజాగా వైట్ డ్రెస్ లో సింపుల్ గా ఉంటూనే తన అందాలను ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగింది. వాణీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.













