Vanara: “వానర” సినిమా హీరోగా, దర్శకుడిగా అవినాశ్ కు మంచి పేరు తెస్తుంది – మంచు మనోజ్
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర” (Vanara). ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. “వానర” చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న “వానర” సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు “వానర” సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడుతూ – మా “వానర” సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన హీరో మనోజ్ గారికి థ్యాంక్స్. మంచి టీమ్ ఎఫర్ట్ తో సరికొత్త మైథలాజికల్ రూరల్ డ్రామా మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు హర్ష మాట్లాడుతూ – మనోజ్ గారితో నాకు స్పెషల్ బాండింగ్ ఉంది. ఈ సినిమా కోసం అవినాశ్ రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాడు. ఈ జర్నీలో మమ్మల్ని కూడా భాగమయ్యేలా చేసినందుకు ఆయనకు థ్యాంక్స్. చెబుతున్నాం. అన్నారు.
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – ఈ సినిమాలో జాయిన్ అయినప్పుడు ఈ టీమ్ మీద పెద్దగా నాకు ఎక్స్ పెక్టేషన్స్ లేవు. చాలామందిలా అవినాశ్ కొత్త హీరోగా, దర్శకుడిగా వస్తున్నాడు అనుకున్నాను కానీ రోజు రోజుకూ అవినాశ్ ఈ సినిమా కోసం పడే కష్టం చూసి గౌరవం పెరిగింది. టీజర్ చూడగానే మీ అందరికీ ఎలాంటి ఇంప్రెషన్ కలిగిందో ఫస్ట్ డే ఫుటేజ్ చూసినప్పుడు నాకూ అలాంటి మంచి ఫీలింగే కలిగింది. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అవినాశ్ “వానర” చిత్రాన్ని రూపొందించారు. అన్నారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ విశ్వజిత్ మాట్లాడుతూ – శ్రీరాముడు ఏమంటాడో అనే భయంతో రావణుడిని ఏం చేయకుండా ఆంజనేయుడు లంకను తగలబెట్టి వదిలేశాడు. ఆయనకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఏం చేసేవాడో. వానర సేనాపతికి, రావణుడికి యుద్దం జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. రెండున్నరేళ్ల క్రితం కొన్ని సీన్స్ ను అవినాశ్ కు నేను చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కానీ సినిమాకు స్క్రిప్ట్ ఉంటే సరిపోదని, స్క్రిప్ట్ నుంచి సినిమా దాకా ఎంతో జర్నీ చేయాలని ఈ మూవీతో తెలిసింది. అన్నారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – మనోజ్ ది గోల్డెన్ హ్యాండ్. ఆయన ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమా సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశారు. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అవినాశ్ ఫాదర్ నేను మంచి స్నేహితులం. ఈ సినిమాలో అవినాశ్ తండ్రి క్యారెక్టర్ లో నటించాను. అవినాశ్ లో ఎంతో ప్రతిభ ఉంది. అతనికి “వానర” సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
చిత్ర సమర్పకులు శంతను పత్తి మాట్లాడుతూ – మా లాంటి కొత్త వాళ్లను సపోర్ట్ చేస్తున్న మనోజ్ అన్నకు థ్యాంక్స్. అవినాశ్ నేను స్కూల్ నుంచి ఫ్రెండ్స్. అతనికి సినిమా మీద చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండేది. ఈ సినిమాను రెండున్నరేళ్ల కిందట అనుకున్నాం. గత జూలైలో స్టార్ట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. మీరంతా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. మా మూవీని చిన్న చిత్రంగా ప్రారంభించినా, ఆ తర్వాత బిగ్ స్కేల్ కు వెళ్లింది. సాయిమాధవ్ బుర్రా, వివేక్ సాగర్, ఛోటా కె ప్రసాద్..ఇలాంటి టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ తో మంచి సినిమా చేశాం. అన్నారు.
డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – పెద్ద సినిమాకు పెట్టాల్సిన టైటిల్ ఇది, ఈ టైటిల్ ఈ సినిమాను పెద్ద రేంజ్ కు తీసుకెళ్తుంది. సినిమా మీద ఎంతో తపనతో యంగ్ టీమ్ చేసిన సినిమా ఇది. అనుభవం ఉన్న నాలాంటి వాళ్లను కూడా ఈ యంగ్ టీమ్ ఇన్స్ పైర్ చేసింది. అవినాశ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. అవినాశ్ కు అన్ని క్రాఫ్ట్ ల మీద పట్టుంది. ఈ సినిమాకు అన్నీ తానై రూపొందించాడు. ఇండస్ట్రీకి “వానర” లాంటి చిత్రాలు అవసరం. ఇలాంటి సినిమాలు ఎన్ని వస్తే ఇండస్ట్రీ అంత బాగుంటుంది. అన్నారు.
డీవోపీ సుజాత సిద్ధార్థ్ మాట్లాడుతూ – “వానర” సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ టైమ్ లో అవినాశ్ కు మూవీ మేకింగ్ మీద ఉన్న ప్యాషన్ తెలిసింది. డీవోపీగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏదైనా సీన్ బాగా రాకుంటే మరోసారి పర్పెక్ట్ గా చేసేవాళ్లం. సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.
హీరో, డైరెక్టర్ అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ – మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఈవెంట్ కు వచ్చిన మనోజ్ అన్నకు థ్యాంక్స్. నేను యాక్టర్ కావాలనేది మా నాన్న కల. ఈ రోజు ఆ కల తీరింది. నాన్న ఈ కార్యక్రమంలో పాల్గొని వేదిక మీద నన్ను చూస్తున్నారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం. “వానర” టీజర్ మీరంతా చూశారు. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చిందంటే కారణం మా టీమ్. సాయిమాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ రాయడంతో పాటు వాటికి ఆర్టిస్టులు ఎలా రియాక్ట్ కావాలో వాయిస్ రికార్డ్ పంపేవారు. దాంతో నాకు షూటింగ్ చేయడం ఈజీ అయ్యింది. వివేక్ సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ త్వరలో వింటారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ గారు ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్ చేశారు. శివాజీ రాజా గారు, హర్ష..ఇలా కో స్టార్స్ అంతా మాకు సపోర్ట్ అందించారు. ఈ సినిమా కోసం అన్ని క్రాఫ్టుల గురించి తెలుసుకుని ఐదు సినిమాలకు రావాల్సిన అనుభవం ఈ ఒక్క సినిమాతో వచ్చింది. విశ్వక్ సేన్ అన్న అడగగానే మా మూవీకి వాయిస్ ఇచ్చారు. అలాగే కిరణ్ అబ్బవరం గారు మా కంటెంట్ చూసి సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో గైడ్ చేశారు. నా నలుగురు ప్రొడ్యూసర్స్ శంతను, అవినాశ్, ఆలపాటి రాజా, అంకిత్ అండగా నిలబడ్డారు. సినిమా కంప్లీట్ అయ్యింది. త్వరలో రిలీజ్ కు తీసుకొస్తాం. సినిమా చూశాక ఇది కొత్త వాళ్లు తీసిన సినిమానా ? అని మీరంతా ఆశ్చర్యపోతారు. వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్ ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్ ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు, ఎలాంటి ఫైట్ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్ పంచుతుంది. అన్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – “వానర” సినిమా టీజర్ లాంఛ్ కు గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. అవినాశ్ గురించి నాకు తెలుసు. చాలా కష్టపడే తత్వం ఉన్నవాడు. ఫస్ట్ సినిమాకే హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. అది అంత సులువు కాదు. ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. అవినాశ్ ఆయన టీమ్ కష్టపడి చేసిన ఈ సినిమా సక్సెస్ కావాలి. అవినాశ్, ఆయన టీమ్ కు మంచి పేరు తీసుకురావాలి. అవినాశ్ ఫాదర్ హనుమంతరావు గారు హీరో కావాలని అనుకున్నారు కానీ పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వెళ్లారు. ఆయన తన కలను కొడుకు అవినాశ్ ద్వారా నిజం చేసుకున్నారు. ఈ రోజు అవినాశ్ ను చూసి హనుమంతరావు గారు గర్వపడుతున్నారు. అవినాశ్ ను ఆయన ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా గారితో అహం బ్రహ్మస్మి సినిమా చేయాలి. త్వరలో ఆ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమా చూశాను బాగా వచ్చింది. శివాజీ రాజా గారు చేసిన సీన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ ఉన్నారు. మ్యూజిక్ మీద నాకున్న ఇష్టంతోనే మోహనరాగ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను. అన్నారు.






