Amir Khan: టాలీవుడ్ డైరెక్టర్ తో అమీర్?
అమీర్ ఖాన్(Amir Khan) నుంచి చివరగా వచ్చిన లాల్ సింగ్ చద్దా(Lal Singh Chaddha) భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో అమీర్ ఖాన్ కొన్నాళ్లపాటూ సినిమాకు బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తనను తాను రీలాంఛ్ చేసుకోవాలని చూస్తున్నాడు అమీర్. ఇలాంటి టైమ్ లో ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamsi Paidipally) డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు(Dil Raju) కు వంశీ స్టోరీ నెరేట్ చేయగా, అమీర్ ఖాన్ అయితే ఈ రోల్ కు పర్ఫెక్ట్ గా సూటవుతారని చెప్పాడట. ఇప్పుడు వంశీ, దిల్ రాజు ఇద్దరూ అమీర్ ను ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇది నిజమైతే తెలుగు డైరెక్టర్ మరొకరు బాలీవుడ్ లోకి అడుగుపెట్టినట్టే.
ఇప్పటివరకు వంశీ ఆరు సినిమాలు చేస్తే అందులో 5 సినిమాలు దిల్ రాజుతోనే చేశాడు. ఇప్పుడు అమీర్- వంశీ పైడిపల్లి ప్రాజెక్టును కూడా ఆయనే నిర్మించనున్నారు. వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి షాహిద్ కపూర్(Shahid Kapoor) తో సినిమా చేస్తాడన్నారు కానీ ఇప్పుడు అమీర్ తో చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్లంతా తెలుగు డైరెక్టర్లతో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న నేపథ్యంలో మన డైరెక్టర్లు ఆ అవకాశాలు వాడుకోవాలని చూస్తున్నారన్నమాట.













