మహేష్ డైరక్టర్ తో మెగాస్టార్ సినిమా..?
సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరూ తన స్పీడ్ ను పెంచారు. ప్రస్తుతం కొరటాలతో ఆయన చేస్తున్న ఆచార్య చివర దశకు చేరుకుంది. ఒకటి రెండు వారాల షూటింగ్ మాత్రమే మిగిలినట్లు తెలుస్తుంది. ఆచార్య అయిపోగానే లూసీఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఇప్పటికే దానికి సంబంధించిన డేట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.
మరోవైపు వేదాళం రీమేక్ ను కూడా మెహర్ తో చేసేందుకు దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా చేయిస్తున్నాడట. ఇక డైరక్టర్ బాబీ కథకు కూడా ఓకే చెప్పాడు చిరూ. ఈ ఇయర్ ఎండింగ్ లో బాబీతో సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. అంటే మొత్తం నాలుగు సినిమాలు చిరూ చేయాలి. ఇవి పూర్తి కాకముందే చిరూ ఇంకా వేరే కథలు కూడా వింటున్నట్లు తెలుస్తుంది.
ఇది కాకుండా వంశీ పైడిపల్లి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథను రాసుకున్నాడట. ఆ కథను చిరూ కు వంశీ చెప్పడం, ఆ కథకు చిరూ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయి, ఈ ప్రాజెక్ట్ ను తప్పకుండా చేద్దామన్నట్లు చిరూ స్పందిచినట్లు వంశీ సన్నిహితులు చెప్తున్నారు. చిరూకు తగిన స్క్రిప్ట్ ను వంశీ రెడీ చేశాడని, వచ్చే యేడాది ఈ సినిమా చేయడానికి వంశీకి మెగాస్టార్ డేట్స్ ఇచ్చే ఛాన్సులున్నాయంటున్నారు. వంశీ తో లాస్ట్ గా మహర్షి తీసిన మహేష్, ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేద్దామనుకున్నా కానీ ఇప్పటి వరకు వీరి కాంబోలో మళ్లీ సినిమా వచ్చింది లేదు. మహేష్ కూడా సర్కారు వారి పాట తర్వత త్రివిక్రమ్, రాజమౌళి లతో సినిమాలు చేయనున్నాడు కాబట్టి వంశీ చాలా టైమ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే వంశీ మరో రూట్ చూసుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.













