బాలీవుడ్ స్టార్ హీరోతో పైడిపల్లి సినిమా
వంశీ పైడిపల్లి(Vamsi Paidipally) గొప్ప సినిమాలేమీ తీయలేదు కానీ అతను కెరీర్లో ఇప్పటివరకు పెద్ద పెద్ద స్టార్లతోనే సినిమాలు చేశాడు. ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(NTR), నాగార్జున(Nagarjuna), మహేష్ బాబు(Mahesh Babu), విజయ్(Vijay) తో కలిసి సినిమాలు చేశాడు వంశీ. అతను ఆఖరిగా విజయ్ తో చేసిన వారసుడు(Varasudu) సినిమా ఓ మోస్తరు ఫలితాన్నిచ్చింది. ఈ సినిమా రిలీజై రెండేళ్లవుతున్నా వంశీ కొత్త సినిమా ఏంటనేది ఇప్పటివరకు అనౌన్స్ అవలేదు.
అంతేకాదు ఈ మధ్య వంశీ వార్తల్లో కూడా కనిపించడం లేదు. అందరూ వంశీని మర్చిపోతున్న టైమ్ లో అతని గురించి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట ప్రచారం అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Amirkhan) తో వంశీ సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది.
ఆమిర్ కోసం సోషల్ మెసేజ్‌తో కూడిన ఓ కథను వంశీ రెడీ చేసి ఆ లైన్ ను వినిపించాడని, ఆ లైన్ విన్నాక ఆమిర్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయి, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని టాక్. ప్రస్తుతం వంశీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి నిర్మాత దిల్ రాజు(Dil Raju)తో కలిసి ఆమిర్ కు ఫుల్ నెరేషన్ ఇవ్వాలని ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. ఏకంగా ఆమిర్ ను మెప్పించాడంటే వంశీ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు.













