Vamsi Paidipally: స్టార్ హీరోల విషయంలో పట్టు వదలని విక్రమార్కుడులా వంశీ

ఇండస్ట్రీలోకి వచ్చిన ఎవరైనా సరే గ్యాప్ తీసుకోకుండ వరుసగా సినిమాలు చేయాలనుకుంటారు. కానీ కొందరికి మాత్రేమే ఆ ఛాన్స్ దక్కుతుంది. కొందరు కావాలని ఎదురుచూసినా ఛాన్సులు రావు. ఇక మరికొందరు మాత్రం కాస్త లేటైనా పర్లేదు, చేస్తే పెద్ద సినిమానే చేయాలని అనుకుంటూ దాన్ని పట్టాలెక్కించడం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తుంటారు.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi paidipally) ఇదే కోవలోకి వస్తాడు. మున్నా(Munna)తో కెరీర్ ను స్టార్ట్ చేసిన వంశీ, అప్పట్నుంచి చేసిన సినిమాలన్నీ స్టార్లతోనే తప్పించి ఎప్పుడూ చిన్న సినిమా చేసింది లేదు. మహర్షి(Maharshi) తర్వాత మహేష్(Mahesh babu) తోనే ఓ సినిమా చేద్దామనుకున్న వంశీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయినప్పటికీ చిన్న సినిమా చేయలేదు. కోలీవుడ్ కు వెళ్లి విజయ్(Vijay) తో వారిసు(varisu) తీశాడు.
వారిసు తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ, ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆమిర్ ఖాన్(Aamir khan) తో సినిమా చేయాలని ప్రయత్నించాడు. కానీ అది వర్కవుట్ అవలేదు. అయినప్పటికీ వంశీ పట్టు వదలని విక్రమార్కుడులా బాలీవుడ్ లోని మరో స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్(Salman khan) తో సినిమాను లైన్ లో పెట్టాడని, దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో త్వరలోనే ఈ ప్రాజెక్టు అనౌన్స్ కానుందని తెలుస్తోంది. ఏదేమైనా వంశీ మాత్రం హీరోల విషయంలో అస్సలు వెనుకడుగు వేయడం లేదు.