‘బాయ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వంశీ పైడిపల్లి
విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం బోయ్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అన్నపూర్ణ స్టూడియోలో సూపర్ స్టార్ మహేహ్ బాబు మహర్షి సెట్లో దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేసారు. వంశీ పైడపల్లి మాట్లాడుతూ టైటిల్ చాలా బాగుంది. అమర్ స్టోరీ లైన్ వినిపించాడు. చాలా బాగుంది. సినిమా అంటే ఫ్యాషన్ గల వ్యక్తి అని తెలిసింది. పోస్టర్ విషయంలో ఇంత శ్రద్ద తీసుకుంటే, సినిమా ఇంకెంత బాగా తీసారో అర్థమవుతుంది. లక్ష్మ, సాహితి, నీరజ్, వినయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆస్కర్, సంగీతం: ఎల్విన్ జేమ్స్, సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు-ప్రదీప్ మునగపాటి, నిర్మాతలు: రవిశేఖర్‌రాజు. అమర్ విశ్వరాజ్, రచన, దర్శకత్వం : అమర్ విశ్వరాజ్.













