వాల్మీకీ కాదు.. గద్దలకొండ గణేష్
వాల్మీకి టైటిల్ని గద్దలకొండ గణేష్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. టైటిల్ తమ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయమై న్యాయస్థానం చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు జిల్లాలలో వాల్మీకి విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. చిత్ర విడుదలను ఈ రెండు జిల్లాలలో నిలిపివేశారు. దాంతో నిర్మాతలు సినిమా పేరుని గద్దలకొండ గణేష్ గా మార్చారు.













