వాల్మీకి భారీ స్పందన
వరుణ్‌తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం వాల్మీకి. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాస్తున్నారు. తమిళ హీరో నల్ల మురళి తనయుడు ఆధర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. తమిళ్ హిట్ చిత్రం జిగర్తాండ ఆధారంగా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సెప్టెంబర్ 6న సినిమాను విడదుల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, ఛాయాగ్రహణం: ఐనాంక బోస్, దర్శకత్వం: హరీష్‌శంకర్.













