వలయం ట్రైలర్ విడుదల
లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న చిత్రం వలయం. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిగంగన సూర్యవన్షి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కె.ఎస్. నాగేశ్వరరావు, నిర్మాత శోభారాణి, డైరెక్టర్ రమేష్ కడుముల, నటుడు రవిప్రకాష్, డైరెక్టర్ నాగు గవర, డైరెక్టర్ చంద్రమహేష్, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, చిత్ర సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు, హీరో లక్ష్, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు.













