నితిన్ తో బస్తీమే సవాల్ అంటున్న వక్కంతం..
యూత్ హీరో నితిన్ సినిమాలు కొద్ది రోజులుగా ప్రేక్షకులని నిరాశపరుస్తూనే ఉన్నాయి. గత చిత్రం “మాచర్ల నియోజకవర్గం ” కూడా థియేటర్ లలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. ఇటువంటి సమయం లో “ఇష్క్” , “గుండె జారీ గల్లంతయిందే ” వంటి ఒక హిట్ పడితే కానీ నితిన్ కష్టాలు తీరేలా లేవు.
నితిన్ చిన్న విరామం తీస్కొని , బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తన 32 వ (నితిన్ 32) చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు.
2022 ఏప్రిల్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు మారేడుమిల్లి అడవులలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రానికి సక్సెఫుల్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం విశేషం.
ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పెళ్ళిసందడి ఫేమ్ శ్రీలీల నితిన్ కి జోడిగా కనిపించనున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించగా, వచ్చే ఏడాది థియేటర్స్ లో ఈ చిత్రం సందడి చేయనుంది.
హ్యారిస్-నితిన్-వక్కంతం ఈ క్రేజీ కాంబోలో వచ్చే మూవీ కోసం ప్రేక్షకులు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హ్యారిస్ అందించే మ్యూజిక్ ఈ చిత్రానికి ఎక్స్ట్రా హైప్ ని క్రియేట్ చేసింది.తన రీరికార్డింగ్ , ట్యూన్స్ తో హ్యారిస్ యూనిక్ మ్యూజిక్ ని అందిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇక బన్నీ తో “నాపేరు సూర్య” వంటి టిపికల్ సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వక్కంతం హిట్ కొట్టలేకపోయారు, కానీ, బుల్లితెర పై ఈ సినిమా ని వీక్షించిన వారికి ట్రీట్ లా అనిపించింది. బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం లో కామెడీ మరియు రొమాన్స్ విషయాలు మిస్ అయ్యాయి.
అయినా వక్కంతం డైరెక్షన్ ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయట్లేదు. అందుకే నితిన్ రూపం లో తనని తాను నిరూపించుకోడానికి చక్కని అవకాశం దక్కింది. లాస్ట్ టైం చేసిన తప్పులని కవర్ చేస్కుంటూ నితిన్ కోసం కథని ఎలా రెడీ చేసారో అన్నది వేచి చూడాలి.













